BC Reservations In Telangana | బీసీ రిజర్వేషన్ల అమలుపై డెడికేటెడ్ కమిషన్‌కు స్వాగతం
BC Reservations In Telangana | బీసీ రిజర్వేషన్ల అమలుపై డెడికేటెడ్ కమిషన్‌కు స్వాగతం
సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన బీసీ జాతీయ నేత ఆర్ క్రిష్ణయ్య
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగింది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. అందులో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదివారం రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు సీఎంతో అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు.
* * *
Leave A Comment